Vishnu Vinyasam : ‘విష్ణు విన్యాసం’ మూడో సింగిల్ రిలీజ్.. లుంగీ స్టెప్‌తో రచ్చ చేస్తున్న శ్రీ విష్ణు

Vishnuvinyasam
Vishnu Vinyasam : ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీ విష్ణు మరోసారి వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తోంది. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతి రావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. హీరోయిన్‌గా నయన సారిక నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు సింగిల్స్, టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా మేకర్స్ మూడో సింగిల్ ‘ఏమిరా బాలరాజు’ను విడుదల చేసి బజ్‌ను మరింత పెంచారు.

Also Read :  Sai Durgha Tej: ‘సేవ్ ద టైగర్స్’ డైరెక్టర్‌తో మెగా హీరో కొత్త సినిమా.. ‘పరువేట’ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

ఈ పాటకు రాధన్ అందించిన స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉత్సాహభరితమైన బీట్‌తో బ్రేకప్ బాధను సరదాగా చెప్పే ప్రయత్నం చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సరదా సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శరత్ సంతోష్ ఎనర్జీతో పాడిన తీరు పాటకు మరింత జోష్ తీసుకురాగా, ప్రేమలో విఫలమైన యువకుడిగా శ్రీ విష్ణు చూపించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆయన వేసిన లుంగీ స్టెప్ మాస్ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది. మొత్తానికి లవ్ ఫెయిల్యూర్‌ను కూడా సెలబ్రేట్ చేసేలా ఉన్న ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read :  NBK 111: బాలయ్య ఫ్యాన్స్ గోపీచంద్ ఫుల్ మీల్స్ .. జూన్ 10న మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ అంటూ పోస్ట్!