
Stunt Master : తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎం. రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్లో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై హీరో విశాల్, స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా, ఇతర సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Stunt driver ‘Mohan Raj’ passed away during a risky stunt with a car for the movie #Vettuvam starring Arya and directed by Pa.Ranjith. 😑 pic.twitter.com/63y3OEtE0x
— Cinema Madness 24*7 (@CinemaMadness24) July 14, 2025
రాజు తన సినిమాల్లో కూడా పని చేసిన స్టంట్ మాస్టర్ అని విశాల్ భావోద్వేగంతో తెలిపారు. అతని ధైర్యం, డెడికేషన్ సినిమాలకు ఎంతో బలం చేకూర్చిందని, ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి అన్ని విధాల సహాయంగా ఉంటానని విశాల్ హామీ ఇచ్చారు. ఇకపోతే ఈ ఘటనపై నెటిజన్లు దర్శకుడు పా. రంజిత్, నటుడు ఆర్య నుంచి ఇంకా స్పందన రాకపోవడాన్ని విమర్శిస్తున్నారు. షూటింగ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిపై కనీసం సానుభూతి కూడా తెలియజేయకపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నారు. అనేక చిత్రాలకు స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన రాజు, తన డెడికేషన్‌కి, సాహసానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ ఓ అద్భుతమైన టాలెంట్‌ను కోల్పోయిందన్న విషాదం పరిశ్రమ మొత్తాన్ని కుదిపేసింది.
Deeply saddened after hearing the news of the demise of a great performer and actor shri #kotasrinivasarao sir. Going to miss a great performer and actor on the silver screen. Had a great memorable time to work with sir in my movie Sathyam. He used to stand out as a villain in…
— Vishal (@VishalKOfficial) July 13, 2025
One of our great car jumping stunt Artist S M Raju Died today while doing car stunts 😭😭RIP
Our stunt union and Indian film industry ll be missing Him😭😭 pic.twitter.com/9Qr7Zg8Dbb— silva stunt (@silvastunt) July 13, 2025












