King 100: 28 ఏళ్ల తర్వాత కింగ్‌తో టబు ఢీ.. ‘కింగ్ 100’లో ఊహించని ట్విస్ట్!

King

King 100: టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) గురించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఒకప్పటి వెండితెర క్రేజీ కాంబినేషన్ నాగార్జున – టబు మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మ్యాజిక్ కాంబో మళ్లీ రిపీట్ కానుండటంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

గతంలో నాగ్-టబు కాంబోలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. అయితే ఈ సారి రాబోయే సినిమాలో ఒక ఊహించని ట్విస్ట్ ఉండబోతోందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టబు హీరోయిన్‌గా కాకుండా, నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. కేవలం నాగార్జునకు జోడీగా కాకుండా, ఆయనకు ధీటైన విలనిజం పండించే పవర్‌ఫుల్ పాత్రలో టబు నటించనున్నట్లు వార్తలు వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి చేరుకున్నాయి. నాగార్జున కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీగా తెరకెక్కనున్న ఈ 100వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ టబును రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా 28 ఏళ్ల తర్వాత ఈ హిట్ జోడీ సరికొత్త రూపంలో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండటం నిజంగా టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ న్యూస్ అని చెప్పవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.