Teja Sajja : ప్రభాస్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్ తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక హీరో తేజ సజ్జా!

Mirai
Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా వరుస విజయాలతో పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. హనుమాన్ సినిమాతో ఇండియా మొత్తం ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు మిరాయ్ తో మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మొదటి రోజు నుంచే భారీ వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ వీకెండ్‌కి మొత్తం 81.2 కోట్ల గ్రాస్ వసూలు చేస్తూ, ఓవర్సీస్‌లో కూడా 2 మిలియన్ మార్క్ చేరుకునే దిశగా దూసుకుపోతోంది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఇక హిందీలో మాత్రం తేజ సజ్జా ఓ సంచలనం అనే చెప్పాలి. ఇప్పటి వరకు హిందీ మార్కెట్‌లో పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే సత్తా చాటుతున్నారు. కానీ ఇప్పుడు తేజ సజ్జా కూడా వీళ్ల సరసన చేరిపోయాడనే చెప్పాలి. హనుమాన్ సినిమాతో నార్త్ లో మంచి ఫాలోయింగ్‌తో పాటు తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. మిరాయ్‌తో దాన్ని రెట్టింపు చేసుకున్నాడు. అందుకు నిదర్శనమే మిరాయ్ హిందీ వసూళ్లు. హిందీ బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల్లోనే 10 కోట్లు కలెక్ట్ చేసింది మిరాయ్. దీంతో.. తెలుగు నుండి ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి దిగ్గజాల తర్వాత ఈ స్థాయి విజయాన్ని సాధించిన ఏకైక హీరోగా తేజ సజ్జా నిలిచాడు. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జా.