Tom Holland: టామ్ హాలండ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ‘స్పైడర్ మ్యాన్’తో రూ.830 కోట్లు!

Tom Holland

Tom Holland: హాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న సూపర్‌హీరో ఫ్రాంచైజీల్లో ‘స్పైడర్ మ్యాన్’ ఒకటి. ఈ సిరీస్‌లో పీటర్ పార్కర్‌గా నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టామ్ హాలండ్.. తాజాగా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఆయన అందుకోబోయే పారితోషికం ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కోసం టామ్ హాలండ్‌కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కనుందని తెలుస్తోంది.

ఈ సినిమా ద్వారా ఆయన మొత్తం ఆదాయం 100 మిలియన్ డాలర్లకు పైగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.830 కోట్లకు పైమాటేనని అంచనా. అయితే ఈ మొత్తం కేవలం టామ్ హాలండ్ అందుకునే ప్రాథమిక పారితోషికం మాత్రమే కాదట. సినిమాకు ఆయనకు సుమారు 20 మిలియన్ డాలర్ల బేస్ సాలరీ అందనున్నట్లు సమాచారం. దీనికి అదనంగా సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించే బాక్సాఫీస్ వసూళ్ల ఆధారంగా భారీ బోనస్‌లు, లాభాల్లో వాటా కూడా ఆయన ఒప్పందంలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘స్పైడర్ మ్యాన్’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్, టామ్ హాలండ్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స్థాయి డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ రెమ్యునరేషన్ వివరాలపై మేకర్స్ నుంచి అధికారికంగా చిత్రబృందం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.