
Ravi Basrur: యశ్ మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా సౌండ్ డిజైన్‌పై మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనను‘టాక్సిక్’ సౌండ్ డిజైన్‌పై ప్రస్తుతం పనిచేస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు రవి బస్రూర్ ఆసక్తికరంగా స్పందించారు. స్క్రిప్ట్ చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చని, తన వర్క్ విధానం కూడా అదే అని చెప్పారు. ప్రస్తుతం తాను ఎలాంటి ప్రోగ్రామింగ్ వర్క్ చేయడం లేదని స్పష్టం చేశారు.
డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్, యశ్ విజన్‌ను అర్థం చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా సౌండ్‌ను ఎలా చేయాలో నిర్ణయిస్తానని రవి బస్రూర్ తెలిపారు. వారి విజన్ ఆధారంగానే సినిమాకు తగిన సౌండ్ వరల్డ్‌ను క్రియేట్ చేస్తానని చెప్పారు. దీంతో ‘టాక్సిక్’లో సౌండ్ డిజైన్ కూడా సినిమాకు మరో ప్రధాన హైలైట్‌గా నిలవనుందనే ఆసక్తి నెలకొంది. గోవా డ్రగ్ మాఫియా, అండర్‌వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యశ్ రగ్గడ్ లుక్, హై-వోల్టేజ్ యాక్షన్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.














