Vijay Devarakonda : ‘లిటిల్ హార్ట్స్’ విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది : విజయ్ దేవరకొండ

Little hearts
Vijay Devarakonda : మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. తాజాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేష్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మా బ్రదర్ ఆనంద్ ద్వారా నాకు ‘లిటిల్ హార్ట్స్’ మూవీ గురించి చాలా రోజులుగా తెలుసు. ఆనంద్ ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ తో మూవీ చేస్తున్నాడు. సినిమా టీజర్, ట్రైలర్ పంపిస్తుండేవాడు. ఈ టీమ్ లోని వారిని నేనెప్పుడూ కలవలేదు కానీ వాళ్లతో నాకు ఏదో అనుబంధం ఉంది అనిపించేది. మౌళి అండ్ టీమ్ మా ఇంటికి వచ్చి మీట్ అయినప్పుడు సక్సెస్ మీట్ కు రావాలని అడిగారు. నేను కాదనలేకపోయా. వీళ్లంతా ఔట్ సైడర్స్. ఏ సపోర్ట్ లేకుండా సక్సెస్ అందుకున్న వీళ్లు మరెంతో మంది కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఒకరు సక్సెస్ అయితే అది ఎంతోమందికి మంచి చేస్తుంది. మనమూ సక్సెస్ అందుకోవచ్చనే ఒక ఫైర్ న్యూ టాలెంట్ లో కలుగుతుంది. అందుకే వీళ్లకు సపోర్ట్ చేయాలని అనిపించింది. అరవింద్ గారు సక్సెస్ కావడం వల్ల ఆయన దగ్గర బన్నీ వాస్, వంశీ, ధీరజ్, ఎస్ కేఎన్..ఇలా ఎంతోమంది యంగ్ ప్రొడ్యూసర్స్ ఆ కాంపౌండ్ నుంచి రాగలిగారు. ఈ యంగ్ టీమ్ కు నా కంగ్రాట్స్ చెబుతున్నా. నేను ఏ మూవీ టీమ్ ను కలిసినా కాసేపే మాట్లాడతాను. కానీ లిటిల్ హార్ట్స్ టీమ్ తో మూడు గంటలు మాట్లాడాను. డైరెక్టర్ సాయి మార్తాండ్ ఒక చిన్న కథను బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. పర్పెక్ట్ కాస్టింగ్ చేశాడు. కాత్యాయని క్యారెక్టర్ లో శివానీ బాగా నటించింది. మౌళి రీల్స్ ను ఆనంద్ నాకు చూపించేవాడు. ఇతన్ని సినిమాల్లోకి తీసుకురావాలి అనేవాడు. ఈ సినిమాను మౌళి ఎంటర్ టైనింగ్ గా ప్రమోట్ చేసుకున్నాడు. అతని ప్రమోషన్స్ కోసం మౌళి చేసే నెక్ట్స్ సినిమా కోసం ఎదురుచూస్తుంటా. నాకు మా పేరెంట్స్ ఫస్ట్, సినిమా నెక్ట్స్. మౌళి నీలాగే నువ్వు ఉండు. పేరెంట్స్ హ్యాపీగా ఉండేలా చూసుకో. ఈ టీమ్ మరిన్ని మంచి సక్సెస్ ఫుల్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. “ఈ సక్సెస్ మీట్ లో మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ ను మిస్ అవుతున్నా. నీకు నచ్చినట్లు సినిమా చేయి అని కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చారు ఆదిత్య. నా టీమ్ ఇచ్చిన సపోర్ట్ తోనే 32 రోజుల్లో ఈ సినిమా కంప్లీట్ చేయగలిగాను. ఒక్క ఫ్రైడే మా లైఫ్ ను మార్చేసింది. విజయ్ అన్న ఇంటికి పిలిచి మూడు గంటలు మాట్లాడారు. మహేశ్ బాబు, నాని, నాగ చైతన్య ట్వీట్ చేశారు. నా ఫేవరేట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫోన్ చేసి మాట్లాడారు. విజయ్ అన్నతో తరుణ్ భాస్కర్ రూపొందించిన పెళ్లి చూపులు మూవీ నా ఫేవరేట్ ఫిలిం. బన్నీ వాస్ గారితో తప్పకుండా మూవీ చేస్తా” అన్నారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ.. “నా కెరీర్ లో ఏం జరగాలని కోరుకున్నానో అవన్నీ గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. నా ఫేవరేట్ స్టార్స్ అందరూ ట్వీట్స్ చేస్తున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. పిలిపించుకుని మాట్లాడుతున్నారు. విజయ్ అన్న ఇంటికి పిలిచి మాట్లాడారు, రౌడీ వేర్ దుస్తులు ఇచ్చారు. అల్లు అర్జున్ గారు, మహేశ్ గారు ట్వీట్స్ చేశారు. రవితేజ గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మధ్య ఫోన్ వస్తే ఏ సెలబ్రిటీ ఫోన్ చేస్తున్నారు అని చూసుకుంటున్నా. నీ సక్సెస్ మా సక్సెస్ అంటూ సోషల్ మీడియా ద్వారా చాలామంది పోస్ట్ లు చేస్తున్నారు. అవన్నీ చూస్తుంటే చాలా ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతోంది. మా పేరెంట్స్ ను వెకేషన్ తీసుకెళ్లాలనేది నా కోరిక. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది కాబట్టి యూఎస్ టూర్ ఫిక్స్ అయ్యింది” అన్నారు.

హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా మేము ఊహించినంత పెద్ద విజయాన్ని అందించింది. నా కాత్యాయని క్యారెక్టర్ ను ప్రేక్షకులు బాగా లవ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాళ్లు పంపిస్తున్న ప్రశంసలు చూస్తుంటే హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులు తెలుగు హీరోయిన్స్ ను ఆదరించరు అనేది తప్పు అని ప్రూవ్ అయ్యింది. మా సినిమాకు చాలా మంది కొత్తవాళ్లు వర్క్ చేసినా ఎక్సిపీరియన్స్ ఉన్న టీమ్ వర్క్ చేసినట్లే ఉందనే అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. అన్నారు.