Kingdom : ‘కింగ్‌డమ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్ షురూ!

Kingdom
Kingdom : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘కింగ్‌డమ్’ జూలై 31న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం, తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్‌ను ప్రకటించింది. జూలై 26న తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు విజయ్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

ఇకపోతే ఈ సినిమా విజువల్స్, విజయ్ స్టైల్, వినూత్న కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బ్రదర్ సెంటిమెంట్ ప్రధాన అంశంగా ఉంటుందని టాక్. గౌతమ్ తిన్ననూరి సినిమాల్లో ఎమోషన్లకు ఉన్న ప్రత్యేకత ఇక్కడ కూడా కనిపించనుందని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా చివరకు జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఇదే సమయంలో విడుదలవుతున్న ‘హరిహర వీరమల్లు’ వంటి భారీ సినిమాతో పోటీగా నిలబడేందుకు కింగ్‌డమ్ ప్రమోషన్స్ మరింత దూకుడుగా కొనసాగుతున్నాయి. ట్రైలర్‌లో కూడా అదే ఉత్సాహాన్ని చూపించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతోంది.ట్టు తెలుస్తోంది.