Aaryan : విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ నుంచి ‘I’m the Guy’ సాంగ్ విడుదల!

Aaryan
Aaryan : హీరో విష్ణు విశాల్, విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన ‘ఆర్యన్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ‘ఐయామ్ ది గాయ్’ సాంగ్ రిలీజ్ చేశారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు. అలాగే జిబ్రాన్, శ్రీకాంత్ హరిహరన్ అద్భుతంగా పాడారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఈ సినిమాలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో కనిపిస్తారు. సహాయక పాత్రల్లో సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ నటించారు. ‘ఆర్యన్’ చిత్రం అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్