
కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను ఆరు వారాల్లో సిద్ధంచేసి, పరీక్షించగల స్థాయికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం/ ఇంపీరియల్ కళాశాల శాస్త్రవేత్తలు చేరుకున్నారని యూకేలోని ఒక పత్రిక కథనం వెల్లడించింది.
దీనిని సాధించడానికి వారు అత్యంత చేరువగా ఉన్నారని తెలిపింది. కరోనాపై ప్రపంచం సాగిస్తున్న పోరులో అనూహ్యమైన మార్పులు ఈ వ్యాక్సిన్‌తో రానున్నాయని పేర్కొంది. ఒకపక్క కరోనాపై పోరులో కీలకమైన దశకు బ్రిటన్ చేరుకుంటుండగా రెండోసారి ఈ మహమ్మారి విరుచుకుపడవచ్చనే అనుమానాలు ముప్పిరిగొన్నాయి.









