కరోనా వ్యాక్సిన్‌ పరిశోధనల కోసం రూ. 900కోట్లు

కరోనా వ్యాక్సిన్‌ పరిశోధనల గ్రాంటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు కోసం రూ. 900కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం కేటాయించిన నిధుల్లో వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీకి కావాల్సిన మొత్తాన్ని పొందుపరచలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటికి విడిగా నిధులను కేటాయిస్తామని ఆమె స్పష్టంచేశారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ 3.0 ప్రకటించిన సమయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఇక, సెప్టెంబర్‌ నెలలో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 5లక్షలకు పడిపోయినట్లు వెల్లడించారు. కొవిడ్‌ మరణాల శాతం 1.47శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయమని.. మహమ్మారి కట్టడికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. 

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల