సిరాజ్ పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు

టీమిండియా క్రికెటర్లకు ఆస్ట్రేలియా టూర్ లో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా అభిమానులు చేస్తున్న జాత్యహంకార కామెంట్లు వారి మనసులను గాయపరుస్తున్నాయి. మొన్న సిడ్నీ టెస్టులో మన ఆటగాళ్లపై రేసిజం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్ర విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాను ఐసీసీ ఆదేశించింది. అయినా, ఆసీస్ ప్రేక్షకుల తీరు మారడం లేదు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

బ్రిస్బేన్ లో జరుగుతున్న టెస్టులో కూడా జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్ పై ఓ అభిమాని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. యూ బ్లడీ గ్రబ్ అంటూ కేకలు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల