కరోనా మృతులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలట..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా చాలామంది మరణించినా సంగతి తెలిసిందే. ఈ మరణాలతో ఆయా కుటుంబాల్లో ఆర్ధికంగా వెనుకపడ్డారు. ఈ తరుణంలో కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రతిపక్ష పార్టీ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చిన 15 వందల రూపాయలు సరిపోవుని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 12 కేజీల దొడ్డు బియ్యం కాకుండా నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ ను కోరినట్లు తెలిపారు.