
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే నవీన్ పోలిశెట్టి సినిమా అంటే ఉండే అంచనాల కారణంగా ఈ చిత్రంపై కూడా మంచి ఆసక్తి నెలకొంది.
కథ : జమీందారీ కుటుంబంలో పుట్టిన రాజు (నవీన్ పోలిశెట్టి)కి రిచ్‌గా జీవించాలనే కోరిక ఎక్కువ. తాత చేసిన దుబారా ఖర్చుల వల్ల ఆస్తులన్నీ పోయినా, బయటకు మాత్రం గొప్పగా కనిపిస్తూ జీవిస్తుంటాడు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలిసిన చారులత (మీనాక్షి చౌదరి)ను ప్లాన్ ప్రకారం ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి తర్వాత రాజుకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి? ఆ తర్వాత రాజు జీవితం ఎలా మారుతుంది? ఆ సమస్యల నుంచి అతను ఎలా బయటపడతాడు? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ : ఫస్ట్ హాఫ్ హీరో క్యారెక్టరైజేషన్, ప్రేమకథ, పెళ్లి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఈ భాగంలో సినిమాకి ప్రధాన బలం. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై అంచనాలు పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో కథనం కొంత రొటీన్‌గా మారడం, స్క్రీన్‌ప్లే అక్కడక్కడ బలహీనపడటం వల్ల సినిమా పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది. కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కవుట్ అయినా, కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోయింది.
నటీనటుల విషయానికి వస్తే, నవీన్ పోలిశెట్టి తనకు అలవాటైన స్టైలిష్ కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకున్నాడు. రాజు పాత్రలో పూర్తి స్థాయిలో ఒదిగిపోయి మరోసారి తన టాలెంట్‌ను చూపించాడు. మీనాక్షి చౌదరి అమాయకమైన పాత్రలో బాగానే నటించి తన పాత్రకు న్యాయం చేసింది. రావు రమేశ్ తన టైమింగ్‌తో సినిమాకి ప్లస్ అయ్యారు. తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగా నటించారు.
సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ బాగుంది. జె. యువరాజ్ చిత్రీకరణ సినిమాకి విజువల్‌గా ప్లస్ అయింది. మిక్కీ జె. మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగినంత సపోర్ట్ ఇచ్చింది. పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటింగ్‌లో కొన్ని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత కుదురుగా ఉండేది. నిర్మాతలు నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు.
ఫైనల్ గా : ‘అనగనగా ఒక రాజు’ నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, కొన్ని ఫన్నీ సన్నివేశాలు మరియు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్‌తో అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. అయితే రొటీన్ కథనం, అసమతుల్యమైన స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా పూర్తిస్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. యూత్ ఆడియన్స్‌కు ఒకసారి చూడదగిన లైట్ హార్ట్‌డ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నిలుస్తుంది.
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5









