అమితాబ్ సిబ్బందికి కరోనా పరీక్షలు..

బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి ఫ్యామిలీ సభ్యులు కరోనా బారిన పడడం అందర్నీ షాక్ లో పడేసింది. అమితాబ్, అభిషేక్, ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్య క‌రోనా బారిన పడ్డారు. అమితాబ్, అభిషేక్ నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, ఐష్‌, ఆరాధ్యల‌కి ఇంట్లోనే చికిత్సనందిస్తున్నారు.

బ‌చ్చ‌న్ ఫ్యామిలీలో న‌లుగురికి క‌రోనా సోకిన నేప‌థ్యంలో బిగ్ బీకి సంబంధించిన నాలుగు బంగ్లాలు జ‌ల్సా, జ‌న‌క్‌, ప్ర‌తీక్ష‌, వ‌స్తాల‌ని సీల్ చేసి శానిటైజ్ చేశారు. అంతేకాకుండా అమితాబ్‌కి సంబంధించిన 26 మంది సిబ్బందికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. సిబ్బందికి జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో అంద‌రికి నెగెటివ్ వ‌చ్చింద‌ని బీటౌన్ టాక్.