
లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా స్కూల్స్ , కాలేజీ లు అన్ని బంద్ కావడం తో స్టూడెంట్స్ అంత కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్యనే ఆన్లైన్ క్లాస్ లు మొదలు కావడం తో అంత ముందు లాప్ టాప్ , ఫోన్స్ పట్టుకొని క్లాస్ లు వినడం స్టార్ట్ చేసారు. ప్రస్తుతం జూ. పవన్ అదేనండి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా సైతం ఆన్లైన్ క్లాస్ లో బిజీ అయ్యాడు.
తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను రెగ్యులర్ గా షేర్ చేసే రేణు దేశాయ్ తాజాగా ఈ ఫొటోను షేర్ చేశారు. అకీరా ఈ ఫొటోలో ల్యాప్ టాప్ తో బిజీగా ఉన్నాడు. ఈ ఫొటోను షేర్ చేసిన రేణు దేశాయ్ ఫన్నీగా ‘మై టాల్ ప్యాకేజ్ ఆఫ్ జాయ్’ అంటూ కామెంట్ పెట్టింది.









