ఫాంహౌజ్లో గడుపుతున్న దర్శక ధీరుడు ..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు కోలీవుడ్ నటుడు సముద్రఖని , హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడడం..ఇప్పట్లో షూటింగ్ మొదలు పెట్టె ఛాన్స్ లేకపోవడం తో రాజమౌళి ఫాంహౌజ్‌కు మ‌కాం మార్చిన‌ట్టు తెలుస్తుంది. న‌ల్ల‌గొండ జిల్లా నార్క‌ట్ ప‌ల్లికి స‌మీపంలో ఎదులూరు గ్రామంలో రాజమౌళి భారీ ఫాంహౌజ్‌ను నిర్మించుకున్నా డు. మళ్లీ షూటింగ్ మొదలాయె సమయానికి హైదరాబాద్ రావాలని అనుకుంటున్నాడట.