
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పక్క అగ్ర హీరోగా రాణిస్తూనే..మరోపక్క నిర్మాతగా తన సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే చిరంజీవి తో రెండు భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ సాధించిన చరణ్..ప్రస్తుతం కొరటాల – చిరంజీవి కలయికలో చిరు 152 వ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన మోహన్ లాల్ చిత్రం ‘లూసిఫర్’ హక్కుల్ని కొనుగోలు చేసాడు చరణ్.
ఈ చిత్రాన్ని సాహో డైరెక్టర్ సుజిత్ కు ఇచ్చారని..తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ రాస్తున్నారని మొన్నటి వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు మరో షాకింగ్ వార్త ఫిలిం సర్కిల్లో వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని సుజిత్ కు కాకుండా వినాయక్ ఇచ్చినట్లు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ దర్శకత్వ బాధ్యతలు వి వి వినాయక్ కి అప్పగించాలని చిరు భావిస్తున్నారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు రీమేక్ చిత్రాలు ఠాగూర్, ఖైదీ 150 భారీ విజయాలు అందుకున్నాయి. దీనితో లూసిఫర్ రిమేక్ కూడా వినాయక్ కు అప్పగించాలని చిరు ఆలోచనట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలి.









