
RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి…మొదటి సినిమాతోనే ఎంత క్రేజ్ తెచ్చుకోవాలో అంత తెచ్చుకున్నాడు. కేవలం ఆయన మాత్రమే కాదు..ఈ సినిమాలో నటించిన హీరో కార్తికేయ..హీరోయిన్ పాయల్ కు సైతం ఎంతో క్రేజీ వచ్చింది. అజయ్…మహాసముద్రం టైటిల్ తో ఓ కథ సిద్ధం చేసి ఎప్పటి నుండి ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
ఈ సినిమా నుండి రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. ఫైనల్ గా అజయ్.. శర్వానంద్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌశిక్’ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి అందర్నీ మెప్పించింది.. కాగా ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.









