సర్కారు వారి పాట లో మహేష్ తల్లి ఆమేనా..?

మహేష్ – పరశురామ్ కలయికలో తెరకెక్కబోయే చిత్రం సర్కారు వారి పాట. కృష్ణ బర్త్ డే సందర్భాంగా ఈ సినిమాను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల వలన.. షూటింగ్స్ కి అనుమతి లభించినా కొన్ని రోజుల సమయం తీసుకునే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్డ్రాప్తో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని సమాచారం. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను చర్చలోకి తీసుకొస్తుందట. ఈ సినిమాలో హీరో ఓ బ్యాంకు మేనేజర్ గా కనిపిస్తుండగా.. కీర్తి సురేష్ ఈ మూవీలో బ్యాంకు ఎంప్లాయ్ గా కనిపిస్తుందట. ఇంటెలిజెంట్ మహేష్ ప్రేమలో పడే సాఫ్ట్ బ్యాంకు ఉద్యోగినిగా ఆమె పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటె ఈ మూవీ లో మహేష్ తల్లి పాత్రలో సీనియర్ నటి భాగ్యశ్రీని తీసుకోవాలనుకుంటున్నారట చిత్ర మేకర్స్. ఇప్పటికే  ఆమెను సంప్రదించగా సానుకూలంగా స్పందించారని ఓ వార్త బయటికి వచ్చింది. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ…టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.