ప్రభాస్ మూవీ లో అనుష్క..?

ప్రభాస్ – మారుతీ కలయికలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా కథను సిద్ధంచేసాడట మారుతీ. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రాబోతుందని అంటున్నారు. ఇక ఈ మూవీ లో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తుండగా..అందులో ఒక హీరోయిన్ గా అనుష్క ను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ – అనుష్క కలయికలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడమే కాక వీరిద్దరి పెయిర్ ఎంతో బాగుండడం తో అభిమానులు కూడా వీరి కలయికలో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి నిజంగా అనుష్క ను ఈ మూవీ లో ఎంపిక చేసారా లేదా అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.