
నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జూన్ నెలలో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ప్లాన్ చేశారట.
అంతే కాదు ఈ మూవీ రవితేజ ఓ కీలక పాత్ర చేయనున్నాడని..సినిమా సెకండ్ హాఫ్ లో ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రవితేజ ధమాకా , రామారావు , టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలతో పాటు చిరంజీవి మూవీ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇక బాలయ్య..ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.









