రవితేజ కు జోడిగా కేథ‌రిన్ ..

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో ‘వాల్తేరు వీరయ్య’ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో ఓ కీలక రోల్ కోసం మాస్ రాజా రవితేజ నటించబోతున్నాడు. కెరీర్​ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ.. ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్రలో కనిపించారు. అలాగే శంకర్ దాదా చిత్రంలో తళుక్కున మెరిశాడు. ఇక ఇప్పుడు మరోసారి చిరు మూవీ లో కనిపించబోతున్నాడు.

ఈ మూవీ లోరవితేజ సరసన కేథ‌రిన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి, రవితేజ, కేథరిన్ లపై కీలక దృశ్యాల చిత్రీకరణ జరుపుతున్నారట. ఇక ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాని మైత్రీమూవీస్ వారు నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.