
దేశంలో కరోనా తీవ్రత భారీగా ఉన్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలే కాక సినీ , రాజకీయ , బిజినెస్ ఇలా ప్రతి ఒక్క రంగానికి చెందిన వారు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా ఓ ముఖ్య విషయాన్ని పంచుకున్నారు. ఆయన సిబ్బందిలో కొందరికి కరోనా సోకినట్లు తెలియజేశారు. వెంటనే స్పందించిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక వైరస్ సోకిన వారిని కొరెంటైన్ కి పంపినట్లు ఆయన తెలియజేశారు.
ఇక అమీర్ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా అమీర్ అమ్మగారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్నారు.









