కత్తి కి కరోనా వచ్చిందా..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు భారీగా పెరుగుతుండడం తో అనేక మంది దీనిబారిన పడుతున్నారు. మొన్నటి వరకు సినీ ప్రముఖులకు పెద్ద గా కరోనా సోకలేదు. కానీ హైదరాబాద్ లో కేసులు పెరుగుతుండడం తో సినీ ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు.

తాజాగా నటుడు సినీ క్రిటిక్ కత్తి మహేష్ కు కరోనా వచ్చిందంటూ వార్తలు హల్చల్ చేసాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ కావడంతో కత్తి మహేష్ స్పందించారు . తనకు కరోనా లేదని , తనకు కరోనా ఉందని వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కత్తి మహేష్ హెచ్చరించారు. తాను మీడియాలో ఉన్నందున కొద్ది రోజుల క్రితమే మీడియా ప్రతినిధులు అందరికి టెస్టులు చేయించారని… ఈ క్రమంలోనే తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నానని నెగిటివ్ వచ్చిందని అన్నారు.