సింగం డైరెక్టర్ పక్క కమర్షియల్ హీరో..?

సిటిమార్ మూవీ తో హిట్ అందుకున్న గోపీచంద్..త్వరలో పక్క కమర్షియల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఫై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ స్టార్ డైరెక్టర్ హరితో ఓ సినిమా చేసేందుకు ఒకే చెప్పినట్టు తాజా సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సింగం సిరీస్ తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన హరి అయితే, గోపీకి హిట్ దక్కుతుందని భావించి ఓ సూపర్ కాప్ స్టోరీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది చూడాలి.