
బొమ్మరిల్లు, ఢీ, రెడీ, సై లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన జెనీలియా దాదాపు పదేళ్లకు పైగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. బొమ్మరిల్లు సినిమాలో హహ హాసిని అంటూ తనదైన ముద్ర వేసిన జెనీలియా.. రానా తో నటించిన నా ఇష్టం సినిమా తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది. బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్ళాడిన ఈ బ్యూటీ.. పెండ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది.
ఇకపోతే ఇటీవల జెనీలియా భర్త రితేష్ తో కలిసి వేద అనే సినిమాలో నటించింది.ఇక ఈ సినిమాని తెలుగులో నాగచైతన్య మరియు సమంత కలిసి నటించిన మజిలీ సినిమాకి మరాఠీ రీమేకె ఈ సినిమా. ఇక జెనీలియా మరియు తన భర్త ఇద్దరూ కలిసి జంటగా నటించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.
ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ.. “జీవితంలో ఒకటి కావాలంటే ఖచ్చితంగా మరొకటి వదిలేయాల్సి ఉంటుంది. రెండు పడవల మీద ప్రయాణం సాగదు. పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాల్సి వస్తుంది.. ఒకే సమయంలో సినిమాలు ఇంటి పనులు చూసుకోవడం అసలు కుదరదు.. అందుకే నేను సినిమాలు మానేశాను. అంతేకాదు మంచి కథలు దొరికితే ఖచ్చితంగా మళ్ళీ సినిమాల్లో నటిస్తాను” అని అన్నారు.










