
Junior : ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’ సినిమా జూలై 18న గ్రాండ్ గా విడుదల కానుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా, జెనీలియా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, వరాహి చలనచిత్రం నిర్మాణ విలువలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
సుమారు 13 ఏళ్ల విరామం తర్వాత సౌత్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా మీడియాతో మాట్లాడుతూ , “ఈ ప్రాజెక్టు మూడేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చింది. అయితే చేయాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. రితేష్ ఈ కథ గురించి నాకు చాలా పాజిటివ్ గా చెప్పారు. ఒకసారి విన్న తర్వాత నిర్ణయం తీసుకో అన్నారు. దర్శకుడు ఆ కథ, అందులో నా పాత్రను చెప్పిన విధానం నాకు ఎంతగానో నచ్చాయి. నేను బిగినింగ్ నుంచి ఎప్పుడూ చేయని కొత్త క్యారెక్టర్స్ చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ఇందులో నా పాత్ర చాలా స్పెషల్. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. అందుకే తప్పకుండా సినిమా చేయాలి అనిపించి చేశాను. దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ వీళ్ళ అందరితో పనిచేయడం రీయునియన్ లా అనిపించింది. కిరీటి అయితే చాలా కాన్ఫిడెంట్ యాక్టర్. డాన్సింగ్, పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. శ్రీలీల ఎనర్జీ అమేజింగ్. ఇది ఒక గొప్ప ప్యాకేజ్డ్ సినిమా అని చెప్పారు.
ఇక తన కెరీర్ పీక్‌లో ఉండగా విరామం తీసుకున్నా, ఎలాంటి పశ్చాత్తాపం లేదని, మంచి పాత్రల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చిన్న క్యారెక్టర్ అయినా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం. బొమ్మరిల్లు హాసిని వెరీ మెమొరబుల్ క్యారెక్టర్. అలాగే హ్యాపీలో మధుమతి, కథ సినిమా.. ఇప్పటికీ ఆడియన్స్ నా క్యారెక్టర్స్ పేరుతోనే నన్ను పిలుస్తుంటారు. అది ఒక నటిగా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది” అని జెనీలియా చెప్పారు.












