
Junior : ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’ ద్వారా హీరోగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, జెనీలియా కీలక పాత్రలో కనిపించనున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి విశేష స్పందన లభించగా, సినిమా జూలై 18న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి, చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కిరీటి పై మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “పీటర్, సెంథిల్ వంటి టాప్ టెక్నీషియన్స్ కిరీటీని పొగిడితే, అది ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనికి బెస్ట్ సర్టిఫికెట్” అని అన్నారు. జెనీలియా, శ్రీలీల, దేవిశ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్ హైన్ లాంటి టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకి బిగ్ అసెట్ అని పేర్కొన్నారు. ఈ సినిమా 1000కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందంటే దానికి కారణం ఆడియన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్. ఆడియన్స్ కి ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. సినిమాని ఈ లెవెల్ కి తీసుకొచ్చిన సాయిగారిని అభినందిస్తున్నాను. జూలై 18న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. ఇది పైసా వసూల్ మూవీ అవుతుంది అంటూ అభినందనలు తెలిపారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.










