కరోనా నుండి బయటపడ్డ ముగ్గురు ఐపీఎస్ అధికారులు..

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉన్న సంగతి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే దీని బారిన అనేక మంది పడడం జరిగింది. వారిలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్, శిఖా గోయల్, తరుణ్ జోషి కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడ్డారు.

ఈ ముగ్గురు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారు. చికిత్స పూర్తయిన తర్వాత గురువారం తిరిగి విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తిరిగి డ్యూటీ లో చేరుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ పోలీసులు ఘన స్వాగతం పలికారు.