
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం జూన్ 19 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. ముఖ్యముగా కీర్తి నటనకు మరోసారి అంత ఫిదా అయ్యారు. అనేక మంది చిత్ర ప్రముఖులు పొగిడారు. ప్రస్తుతం ఈమె తెలుగులో నితిన్ సరసన ‘రంగ్ దే’లో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి నితిన్‌తో రొమాన్స్ చేయనుంది కీర్తి. ‘రంగ్ దే’ తరువాత నితిన్ మూడు సినిమాలు చేయనున్నాడు. మూడవ సినిమాగా ఆయన ‘పవర్ పేట’ చేస్తున్నాడు. ఈ సినిమాకి కృష్ణచైతన్య దర్శకత్వం వహించనున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించనుందట. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని సమాచారం. వీటి తో పాటు మహేష్ సర్కారు వారి పాట లో కేసుల కీర్తినే హీరోయిన్ అని అంటున్నారు. మొత్తం మీద మహానటి తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్సులు లేకపోయినా ఇప్పుడు మాత్రం వరుస ఛాన్సులు అమ్మడికి తలుపు తడుతున్నాయి.









