నెక్స్ట్ వెంకీ తోనేనట ..

ఇండస్ట్రీ లో కూల్ డైరెక్టర్ గా గుర్తింపు ఉన్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య సాయి పల్లవి లతో ‘లవ్ స్టోరీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ ఈ సినిమా చేయడం..అందులోనూ సాయి పల్లవి , నాగ చైతన్య లు నటించడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.

లాక్ డౌన్ అనంతరం సినిమా షూటింగ్ మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. కేవలం ఇంకా 15 రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి ఉండడం తో జులై లో అది పూర్తి చేసి ఆగస్టు లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని భావిస్తున్నారట. ఇదిలా ఉంటె ఈ సినిమా పూర్తి కాగానే ఫ్యామిలీ హీరో వెంకటేష్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఈ సినిమాను ఏసియన్ సినిమాస్ సంస్థ నిర్మించనుందని అంటున్నారు.

ప్రస్తుతం వెంకటేష్ ‘నారప్ప’తో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టాలని చూస్తున్నారు. అలాగే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కూడా వెంకీ సినిమా చేయాలనే యోచనలో ఉన్నారట. అంతేకాకుండా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘F3’ని కూడా పట్టాలెక్కించనున్నారు. ‘F2’కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాలో మళ్లీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించనున్నారు. ‘నారప్ప’ తరవాత వెంకటేష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని టాక్.