ప్రశాంత్ – ఎన్టీఆర్ మూవీ ఇప్పట్లో లేనట్లేనా..?

కేజీఎఫ్‌ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో బిజీ గా ఉన్నాడు. రెండోవ చిత్రంతోనే తన సత్తా ఏంటో చూపించిన ప్రశాంత్ నీల్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కేవలం కన్నడ నిర్మాతలే కాదు మన టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సైతం ఈయన తో సినిమాలు నిర్మించేందుకు పోటీ పడుతున్నారు. కానీ ఆ ఛాన్స్ మాత్రం మైత్రి మూవీ మేకర్స్ కు ఇచ్చాడు ప్రశాంత్. ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి ఓ పవర్ ఫుల్ చేయబోతున్నట్లు అధికారికంగా తెలిపారు.

తాజాగా ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌ ‘గొప్ప మనసు కలిగిన సంచలన దర్శకుడికి శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని రేడియేషన్‌ సూట్‌లో కలవబోతున్నాం’ అని ట్వీట్ చేసింది. దాంతో ఎన్టీఆర్ సినిమాకు ‘రేడియేషన్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ఐతే ఈ మూవీ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఈ మూవీ నుండి బయటికి రావడానికి ఎన్టీఆర్ కి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఆ చిత్రం తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ పూర్తి చేయాల్సివుంది. ఎంత త్వరగా పూర్తి చేసినా ఆ మూవీ విడుదల 2021 చివర్లో లేదా 2022 ప్రారంభంలో ఉంటుంది. కెజిఎఫ్ మూవీ అక్టోబర్ 23న విడుదల కానుంది. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టాల్సింది ఉంది. దీనితో త్రివిక్రమ్ మూవీ పూర్తి అయ్యే వరకు ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనలేడు. కాబట్టి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మొదలు కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.