
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు సంయుక్తంగా తెలుగు లో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి రాగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లకు బ్రేకుపడింది. రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతి రావడం తో షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఓ ప్రత్యేక సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లోనే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేస్తారట. ఈ సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు పవన్ కూడా ఓ నిర్మాత అని తెలుస్తుంది.
రెమ్యూనిరేషన్ విషయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పవన్ కు కూడా వకీల్ సాబ్ నిర్మాణంలో వాటా వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ సినిమాకు పవన్ రెమ్యూనిరేషన్ విషయంలో ఆది నుంచీ అనేక గ్యాసిప్ లు వినిపించాయి. పవన్ కాస్త గట్టిగానే పారితోషికం కోరుతున్నారని, దిల్ రాజు బేరాలు సాగించారని వార్తలు వినవచ్చాయి. ఆఖరికి ఈ డీల్ రెండు విధాలుగా సెట్ అయిందని తెలుస్తోంది.
ఒకటి. కొంత మొత్తం పారితోషికంగా ఫిక్స్ డా ఇవ్వడం. దాంతో పాటే నిర్మాణంలో భాగస్వామిని చేసి, లాభాల్లో వాటా ఇవ్వడం. అయితే ఎంత మొత్తం పారితోషికంగా ఇస్తున్నారు. ఎంత శాతం లాభాల్లో వాటా ఇస్తున్నారు అన్నది ఇంకా తెలియలేదు. కానీ ఈ రెండురకాల డీల్ కుదిరిన మాట మాత్రం వాస్తవం అని గట్టిగా చెపుతున్నారు.









