ఆర్ఆర్ఆర్ ఫై రణవీర్ కామెంట్స్

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ (మార్చి 25) న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఇదే క్రమంలో ఈ మూవీ ని చూసిన సినీ ప్రముఖులంతా తమ స్పందనను తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో రణవీర్ తన స్పందనను తెలిపాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం హాలీవుడ్ సినిమాలను కూడా బాక్సాఫీస్ వద్ద బీట్ చేసేసి దూసుకెళ్తుంది. ఇది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది”.. అన్నాడు. అంతేకాదు, ఈ సందర్భంగా తెలుగులో నాటు నాటు సాంగ్ పాడి ఆశ్చర్యపరిచాడు. ఫైనల్‌గా రాజమౌళి ఇలాంటి గ్రేట్ సినిమాలతో ఇండియన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది.. అని ప్రశంసల వర్షం కురిపించాడు.