
నైజాం లో ఆర్ఆర్ఆర్ భారీ రికార్డు నెలకొల్పింది. కేవలం రెండు వారాలు పూర్తి కాకముందే 100 కోట్ల షేర్ రాబట్టి అరుదైన రికార్డు నెలకొల్పింది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్.
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ (మార్చి 25) న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. రెండో వారంలోను కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 243.5 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం.









