
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ నిన్న (మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది.
3 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు చూస్తే..
నైజాంలో రూ. 15.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.14 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.72 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.95 కోట్లు, కృష్ణాలో రూ. 2.03 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలు రాబట్టి .. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.35 కోట్లు షేర్, రూ. 50.50 కోట్లు గ్రాస్ రాబట్టింది. మొత్తంగా మూడు రోజులకు గాను రూ. 139.09 కోట్లు షేర్, రూ. 203 కోట్లు గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 275.54 కోట్లు వసూలు చేసింది.









