
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ (మార్చి 25) నప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది.
ఈ సినిమా అమెరికాలో 1000కి పైగా థియేటర్స్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే, అక్కడ ఆర్ఆర్ఆర్ ప్రీమియం ఫార్మాట్ అయిన డాల్బీ విజన్, సినిమార్క్ ఎక్స్‌డి ప్రదర్శనలు మొదటి వారం మాత్రమే ఉండబోతున్నాయట. దీంతో ఈ ఫార్మాట్స్‌లో సినిమా చూసేందుకు మరో మూడు రోజులు మాత్రమే ఉందని, రెండవ వారం నుంచి సాధారణ ఆర్ఆర్ఆర్ ప్రింట్ ప్రదర్శించబడుతుందని తాజాగా ఓ వార్త వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే గనక నిజమైతే ఈ ఫార్మాట్‌లో చిత్రాన్ని చూడాలనుకున్న వారికి నిరాశే అని అర్థమవుతోంది.









