
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ (మార్చి 25) న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది.
దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే 500 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఓటిటి లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మే 25 న ప్రముఖ ఓటిటి సంస్థలైన జీ 5 మరియు నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.









