
మెగాస్టార్ చిరంజీవి – నటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా తెరపై కనిపించబోతున్నారా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఇదే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ నేపథ్యంలో ఉండగా..లాక్ డౌన్ రావడం తో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
కాగా ఈ మూవీ లో ఓ ప్రత్యేక రోల్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. చిరు, చెర్రీ ఇందులో గురు శిష్యులుగా కనిపించనుండగా.. చెర్రీ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చెర్రీకి హీరోయిన్‌తో పాటు ఓ పాటను కూడా పెట్టాలని కొరటాల భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో రష్మిక, కియారా, అలియా ఇలా పలువురి పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. నక్సలైట్‌గా ఆమె పాత్ర ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే విరాట పర్వంలో సాయి పల్లవి నక్సలైట్‌గా కనిపిస్తుండగా.. మరోసారి ఆ పాత్రకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.









