
లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్లు , అలాగే సీరియల్ షూటింగ్ లు ఇలా అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలు సూచిస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు సీరియల్స్ , చిన్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కరోనా వెంటాడుతుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు , బుల్లితెర నటులు కరోనా బారిన పడగా.. బుల్లితెర హీరోయిన్‌గా మహిళల విశేష ఆదరణ పొందిన నవ్యసామి వైరస్ బారిన పడినట్టు విశ్వసనీయ సమాచారం.
‘నా పేరు మీనాక్షి’ , ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్‌గా మరీ ముఖ్యంగా తెలుగు మహిళా ప్రేక్షకులను ఈ హీరోయిన్ అలరిస్తున్నారు. కొన్నిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఈమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో నవ్యసామి ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు.









