శ్రీలీల టూ హాట్ బేబీ..

‘పెళ్లి సందD’ ఫేమ్ శ్రీలీల ప్రస్తుతం టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కించిన ‘పెళ్లి సందD’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ప్రేక్షకులను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో అమ్మడికి అవకాశాలు వరుసగా వస్తున్నాయట. ఇప్పటికే మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కాక మరికొన్ని సినిమాలు లైన్లో ఉండడం తో అమ్మడు ఫుల్ బిజీ అయ్యింది. ఇలా ఒక పక్క వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది.

తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. దీనికి క్యాజువల్లీ అంటూ సింపుల్ ట్యాగ్ ఇచ్చింది. అయితే అభిమానులు మాత్రం వేరే విధంగా చూస్తున్నారు. క్యాజువల్లీ బట్ శ్రీలీల టూ హాట్ గురూ! అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్మోకీ కళ్లు .. దోర దొండ పెదవులు.. దొడ్డు ముక్కుతో ఎంతో ముద్దొచ్చేస్తోంది.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ వేస్తున్నారు.