
లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. మూడు నెలల వరకు ఉపశమనం కల్పించింది. విద్యుత్ బిల్లులు చెల్లింపుల విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. కొందరు ఆన్లైన్లో చెల్లించినప్పటికీ, మరికొంతమంది కట్టకుండా ఉన్నారు . కాగా ఇప్పుడు మూడు నెలల బిల్లులు ఒకేసారి తీసి ఇవ్వడం తో షాక్ అవుతున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుండి సెలబ్రటీస్ వరకు తమకు వచ్చిన బిల్లులు వామ్మో అంటున్నారు.
తాజాగా తాప్సికి కూడా ఇది తప్పలేదు. ఆమె నివాసముంటున్న ఇంటికి జూన్ నెలకు గాను 36 వేల రూపాయల కరెంట్ బిల్ రావడంతో షాక్ అయిందట తాప్సి. దీంతో ఈ విషయాన్ని వెంటనే ఆమె విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.









