నెపోటిజమ్ ఫై తమన్నా ఏమన్నదంటే..

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత ఇండస్ట్రీ లో నెపోటిజమ్ ఎక్కువగా వినిపిస్తుంది. చిత్రసీమ లో వారసులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని..కొత్తవారికి తొక్కేస్తారని..కాస్త పైకి వచ్చాడంటే అతడికి అవకాశాలు రాకుండా చేస్తారని..ఇలా చేయడం వల్లే చాలామంది టాలెంట్ నటులు ఆత్మహత్య చేసుకున్నారని అంత విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నెపోటిజమ్ ఫై స్పదించగా.. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ నెపోటిజంపై తన అభిప్రాయం వెల్లడించింది.

బంధుప్రీతి, రాజకీయాలు అంతటా ఉంటాయి. ఇది మన గెలుపు, ఓటములను నిర్ణయించలేదని నా భావన అని తమన్నా చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎలాంటి పరిచయాలు లేవు. కేవలం ఓ ముంబై అమ్మాయిని మాత్రమే. తెలుగు, తమిళ భాషలు రావు. అక్కడి వారెవరు నాకు తెలియదు. అయిన నా కష్టం, టాలెంట్ చూసి వరుస అవకాశాలు ఇచ్చారు. విజయాలకి, పరాజయాలకి విధిరాతే కారణం అని తెలిపింది.