
పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తాజాగా తరుణ్ భాస్కర్ మలయాళ సినిమా కప్పెలపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇందులో హీరో అరవడాలు లేవు, మాస్ అప్పీల్ లేదు. అనవసరపు సన్నివేశాలు లేవు అంటూ పెద్ద పోస్ట్ పెట్టాడు. అయితే కొందరు అభిమానులు తరుణ్ భాస్కర్.. తమ హీరోను ఉద్దేశించే ఆ పోస్ట్ పెట్టాడని భావించి సోషల్ మీడియా వేదికగా తరుణ్ పై ట్వీట్స్ దాడి మొదలు పెట్టారు. దీంతో ట్రోలింగ్ పై తరుణ్ భాస్కర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కొందరు నెటిజన్స్ తనను దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని తరుణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తనని వేధించిన వారి ఫోన్ నెంబర్స్, ఐడీలు సైబర్ పోలీసులకి అందించారు. గచ్చిబౌలి పోలీసులు తన ఫిర్యాదుని స్వీకరించినట్టు తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు.









