గని నిర్మాతలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

గత కొద్దీ రోజులుగా తెలంగాణ సర్కార్..పెద్ద సినిమాల టైం లో టికెట్స్ ధరలు పెంచుకునే అవకాశం కలిపిస్తున్న వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రానికి అయితే ఏకంగా రూ. 70 ల వరకు పెంచుకునే ఛాన్స్ ఇవ్వడం తో నైజాం లో భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ వారం వరుణ్ తేజ్ నటించిన గని మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే గని చిత్రానికి మాత్రం తెలంగాణ సర్కార్ పాత టికెట్ ధరలనే కొనసాగించాలని తేల్చి చెప్పింది.

పాత రేట్ల ప్రకారం అయితే మల్టీప్లెక్స్ లో 250, 200 రూపాయలు ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో గరిష్టంగా 150 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ కి ఈ రేట్లు సరిపోతాయి, వీటిని పెంచాల్సిన అవసరం లేదు అని అటు ప్రేక్షకులు, ప్రభుత్వం కూడా అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కేవలం 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకి మాత్రమే రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తాము అని తెలిపారు కాబట్టి ఏపీలో గని సినిమాకి టికెట్ రేట్లు పెరిగే అవకాశం లేదు.