వెబ్ సిరీస్ లో త్రిష

ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ మూతపడడం తో అంత డిజిటల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అగ్ర నటి నటుల దగ్గరి నుండి చిన్న చితక నటి నటుల వరకు అంత వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయనుంది. ఇప్పుడు వీరి బాటలోనే త్రిష కూడా తమిళంలోని ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఇంట్రస్టింగ్ గా ఉందట.

ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ సిరీస్ అని, ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో త్రిష కృష్ణన్ ఈ వెబ్ సిరీస్ లో నటించబోతుందట.