వెబ్ సిరీస్ లో మహర్షి డైరెక్టర్ బిజీ

వంశీ పైడిపల్లి – మహేష్ కలయికలో మహర్షి చిత్రం వచ్చి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా అనంతరం వంశీతోనే ఓ సినిమా చేయాలనీ మహేష్ అనుకున్నాడు. కానీ వంశీ చెప్పిన కథ నచ్చక పోవడం తో వంశీ కి బదులు పరుశురాం కు ఆ ఛాన్స్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు వంశీ ఓ వెబ్ సిరీస్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేసాడట. ప్రస్తుతం దాని పని వంశీ బిజీ గా ఉన్నాడని సమాచారం.