
డిస్ట్రిబ్యూటర్ గా పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్న వరంగల్ శ్రీను..తాజాగా టాలీవుడ్ నాలుగు బడా చిత్రాల నైజాం రైట్స్ దక్కించుకొని వార్తల్లో నిలిచారు.
గోపీచంద్ -సంపత్ నంది కలయికలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సీటీమార్, రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా విరాటపర్వం మరియు రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ చిత్రంతో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న శ్రీకారం చిత్రాల నైజాం థియరిటికల్ రైట్స్ ను శ్రీను దక్కించుకున్నారు.
ఈ నాలుగు చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉంది. లాక్ డౌన్ అనంతరం మిగతా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయనున్నారు. థియేటర్స్ పునఃప్రారంభమైన వెంటనే ఈ చిత్రాలు విడుదల కానున్నాయి.









