యామీ గౌతమ్ ను కూడా వదలని హ్యాకర్స్

చిత్రసీమకు చెందిన నటి నటుల సోషల్ మీడియా పేజీల అకౌంట్ లను హ్యాకర్స్ హ్యాక్ చేస్తుండడం తెలిసిందే. ఇప్పటికే పలువురికి ఇలా జరుగగా..తాజాగా యామీ గౌతమ్‌ అకౌంట్‌ను కూడా హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని యామీ స్వయంగా ప్రకటించింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారంటూ ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేసింది. ఈ విషయమై యామీ గౌతమ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘నిన్నటి నుంచి నేను నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వాడలేకపోతున్నాను. బహుశా అకౌంట్‌ హ్యాక్‌కు గురైనట్లుంది. అకౌంట్‌ను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంతలోపు నా అకౌంట్‌ నుంచి ఏమైనా అసాధారణ పోస్టింగ్‌ వస్తే వాటితో జాగ్రత్తగా ఉండండి’ అంటూ పోస్ట్‌ చేశారు.